చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం బత్తుల వారి పల్లి గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... బత్తులవారిపల్లికి చెందిన సుభాషిని అనే మహిళకు చెందిన ఐదు నాటు కోళ్లు తాజాగా మృతి చెందాయట. ఎవరో తన నాటు కోళ్లకు మందు పెట్టి చంపేశారని భావించిన సుభాషిని పూతలపట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పశు వైద్యాధికారితో తమ సమక్షంలోనే పోలీసులు కోళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే వాళ్ల పూల మొక్కలకి పక్కింటి వారు యూరియా చల్లారని.. అది తిని తన నాటు కోళ్లు మృతి చెందాయని సుభాషిణి ఫిర్యాదులో పేర్కొంది.