ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటికి తీసుకొచ్చారని తెలియగానే మంగళవారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తెలిపారు. నవంబర్ 12 నుండి సిల్క్యారా రోడ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను తరలించే రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం సాయంత్రం ముగిసింది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఠాకూర్ తెలియజేస్తూ, ఎన్నికల ప్రచార సమయంలో కూడా, ప్రధానమంత్రి మోడీ కనీసం రోజుకు రెండుసార్లు చిక్కుకున్న కార్మికులను పరిశీలించేవారు అని తెలిపారు.