ఆపదలో ఉన్నామని తన దగ్గరికి వచ్చి గోడు చెప్పుకున్న బాధితులకు తక్షణ సాయం అందజేసి మరోసారి మంచి మనసును చాటుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. అవుకు రెండో టన్నెల్ ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు గురువారం నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైయస్ జగన్ను కొందరు అభాగ్యులు కలిశారు. అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రికి వారి ఆవేదన చెప్పుకున్నారు. వారి బాధలు విని చలించిన సీఎం వైయస్ జగన్ వారిలో ఒకరికి రూ.లక్ష, మరొకరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్ను ఆదేశించారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో 15 నిమిషాల్లోనే బాధితులకు కలెక్టర్ చెక్కులు అందజేశారు.