కార్తీకమాసం మూడవ సోమవారం కావడంతో శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో భక్తజనం పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. క్యూలైన్లో వేచి ఉన్న వేలాదిమంది భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టనుంది. ముక్కంటీ క్షేత్రం శివనమస్మరణతో మారుమోగుతోంది.