ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులకు పాడేరు జేఎఫ్ఎం కోర్టు 18 నెలల జైలు శిక్షను విధించినట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది ఒడిశా రాష్ట్రానికి చెందిన సుబాల గలారి, సుభాశ్ గాలరి, లభాలభారీక్ అనే ముగ్గురు పదిహేను ద్విచక్ర వాహనాలను చోరీ చేసి పట్టుబడ్డారు. అప్పట్లో వీరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వీరికి పద్ధెనిమిది నెలల జైలు శిక్షను కోర్టు విధించినట్టు ఎస్ఐ చెప్పారు.