ఏపీలో మిచౌంగ్ తీవ్ర తుపాను తీరానికి సమాంతరంగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గాలుల తీవ్రత పెరిగిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
తుపాను ప్రభావంతో కృష్ణపట్నం నుంచి మచిలీపట్నం వరకు పోర్టులకు పదో నంబరు, కాకినాడకు తొమ్మిది, విశాఖ, కళింగపట్నం పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశామన్నారు.