రాప్తాడు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విశేషంగా జనం తరలివచ్చారు. బైక్ ర్యాలీ తర్వాత, జరిగిన బహిరంగ సభ జై జగన్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. నాలుగున్నరేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జరిగిన మేలును నాయకులు మరోసారి గుర్తుచేశారు. బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరామ్, ఎంపీలు నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.