తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పశు వైద్య శిబిరాల ఏర్పాటు, పశువులకు గడ్డి సరఫరా వంటి అవసరాలకు నిధులు వినియోగించుకునేందుకు కలెక్టర్లకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో సహకరించేందుకు 8 జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాపట్ల జిల్లాకు కాటంనేని భాస్కర్, అంబేడ్కర్ కోనసీమకు జి జయలక్ష్మి, తూర్పుగోదావరికి వివేక్ యాదవ్, ప్రకాశంకు పీఎస్ ప్రద్యుమ్న, కాకినాడకు ఎన్ యువరాజ్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుకు సీహెచ్ హరికిరణ్, తిరుపతికి జే శ్యామలరావు, పశ్చిమగోదావరికి కే కన్నబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జీఓ జారీ చేశారు. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.