దేశంలో పెరుగుతున్న వలసలను అరికట్టేందుకు ఉపాధి వీసాలను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్‌లోని రిషి సునాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి అధిక వేతనాలతో కూడిన విదేశీ నిపుణులకు మాత్రమే వీసాలు ఇవ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే వారికి కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బ్రిటన్ హోం మంత్రి క్లెవర్లీ సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్ లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.