వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ... కరోనా రోజుల్లో రాప్తాడు ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకున్నాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి పనిచేసిన తీరు ప్రజల ప్రాణాల్ని నిలబెట్టింది. పేరూరు డ్యాంకు మూడు సంవత్సరాలు వరుసగా నీళ్లు తీసుకొచ్చాం. నాల్గో సంవత్సరం వరుణదేవుడి ఆశీస్సులతో వర్షాలతో డ్యాం నిండింది. మూడు రిజర్వాయర్లు తెచ్చుకున్నాం. నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయలను డీబీటీ, నాన్ డీబీడీ ద్వారా రాప్తాడు ప్రజలకు అందించిన సీఎం వైయస్ జగన్. అలవిగాని హామీలిచ్చి అధికారంలో రావాలన్నదే చంద్రబాబు కుటిల నీతి. అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ ఈరోజు జగనన్న పెద్ద అండ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లల పెద్ద చదువుల కోసం జగనన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. రాప్తాడు నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్. పీఏబీఆర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఆత్మకూరు, అనంతపురం రూరల్‌కు నీరు ఇచ్చి.. ఇంటింటికీ కుళాయి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి అని తెలియజేసారు.