మిగ్జాం తుపాను ప్రభావం కారణంగా విశాఖ నుంచి 23 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు డైరెక్టర్ తెలిపారు. ‘‘విమానాశ్రయం పూర్తిస్థాయిలో ఆపరేషన్లో ఉంచుతున్నాం.
అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం’’ అని తెలిపారు.