పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంత మండలాల్లో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఎం లంక నుంచి 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆరుగురు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఈతగాళ్లు, మెకనైజ్డ్ బోట్లను సిద్ధం చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.