బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు నిరుపమానమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి.. నివాళులు అర్పించారు. ‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.