టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైయస్ఆర్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం వైయస్ జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.