ఏపీలో తుపాను బాధితుల కోసం సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2500 చొప్పున ఇస్తుండగా..
తాజాగా పునరావాస కేంద్రాలకు రాని వారికి సైతం ఈ సాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ప.గోదావరి, కోనసీమ, కాకినాడ, తూ.గోదావరి జిల్లాల్లో ఈ సాయం అందించనున్నారు.