అనంతపురం మండలం కక్కలపల్లి గ్రామానికి చెందిన అక్కులప్ప, అతని భార్య నాగేంద్రమ్మ ఆదివారం ఆటోలో కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి వెళుతూ ఉండగా ధర్మవరం మండలం తుంపర్తి రోడ్డు సమీపాన అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న అక్కులప్పకు గాయాలవ్వగా వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నాగేంద్రమ్మ ఎటువంటి గాయాలు తగలకుండా బయటపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa