ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మహోబా జిల్లాలో 9వ తరగతి విద్యార్థినిని పదునైన ఆయుధంతో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. హత్యానంతరం యువతి మృతదేహాన్ని పొలంలో పడేశాడు.
స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జిల్లాలోని పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహువా గ్రామంలో ఈ హత్య జరిగింది.