ఏపీ ప్రజలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందని వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 12, 19, 26న కోయంబత్తూరు-బరౌని(06059) అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైలు ఉదయం 11.30గంటలకు కోయంబత్తూరులో బయలుదేరి.. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 12.08గంటలకు దువ్వాడ చేరుకుని.. ఇక్కడి నుంచి 12.10గంటలకు వెళుతుంది. బరౌని-పొదనూరు(06060) ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో ఈనెల 14, 21, 28 తేదీల్లో అర్ధరాత్రి 11.45గంటలకు బరౌనిలో బయలుదేరి మూడో రోజు తెల్లవారుజామున 3.48గంటలకు దువ్వాడ వస్తుంది. ఇక్కడి నుంచి తెల్లవారుజామున 4గంటలకు బయలుదేరి వెళుతుంది.
ఈనెల 13, 20, 27 తేదీల్లో తాంబరం-సంత్రాగచ్చి(06079) ప్రత్యేక రైలు మధ్యాహ్నం 1గంటకు తాంబరంలో బయలుదేరి తరువాత రోజు తెల్లవారుజామున 2.30గంటలకు దువ్వాడ చేరుకుని.. ఇక్కడి నుంచి 2.35గంటలకు వెళుతుంది. సంత్రాగచ్చి-తాంబరం(06080) ప్రత్యేక రైలు ఈనెల 14, 21, 28 తేదీల్లో తిరుగు ప్రయాణంలో రాత్రి 11.40గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి.. ఆ తర్వాత రోజు సాయంత్రం 4.55గంటలకు దువ్వాడ చేరుకుని.. ఇక్కడి నుంచి సాయంత్రం 5గంటలకు వెళుతుంది. ఈనెల 12, 19, 26 తేదీల్లో తాంబరం-సంత్రాగచ్చి(06053) ప్రత్యేక రైలు రాత్రి 10.30గంటలకు తాంబరంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.15గంటలకు దువ్వాడ చేరుకుని ఇక్కడి నుంచి 11.17 గంటలకు వెళుతుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి-తాంబరం(060504) ప్రత్యేక రైలు ఈనెల 14, 21, 28 తేదీల్లో ఉదయం 5గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి.. అదే రోజు రాత్రి 8.48గంలకు దువ్వాడ వస్తుంది. ఇక్కడి నుంచి 8.50గంటలకు బయలుదేరి తాంబరం వెళుతుందన్నారు. ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.