ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో లైన్ పనులు దృష్ట్యా,,,,పలు రైళ్లను రద్దు చేసిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 07:48 PM

ఆంధ్ర ప్రదేశ్‌ పరిధి సూరారెడ్డిపాలెం, ఒంగోలు, విజయవాడ సెక్షన్‌లలో మూడో రైల్వే లైన్‌ ఏర్పాట్లు దృష్ట్యా 24 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పరిధి వరంగల్‌ సెక్షన్‌లో కూడా పనులు జరుగుతున్నాయి. ఈ నెల 12,13,15,16,18,19 తేదీలలో తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేశారు. ఈ నెల 13,14,15,17,18,20,21 తేదీలలో పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేశారు. తిరుపతి-బిలాస్‌పూర్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 14,17 తేదీలలో రద్దు చేశారు. బిలాస్‌పూర్‌-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 12,16,19 తేదీలలో రద్దు చేశారు.


ఈ నెల 17న తిరుపతి-విశాఖ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేశారు. అలాగే విశాఖ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 18న రద్దు చేశారు. ఈ నెల 18న విశాఖ-చెన్నై మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేశారు. చెన్నై-విశాఖ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 12,19 తేదీలలో రద్దు చేశారు. విశాఖ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 18న రద్దు చేశారు. తిరుపతి-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 12,19 తేదీలలో రద్దు చేశారు.విశాఖ-మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 16,17 తేదీలలో రద్దు చేశారు. మహబూబ్‌నగర్‌-విశాఖల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 17,18 తేదీలలో రద్దు చేశారు. 


ఈ నెల 16న హౌరా-ఎర్నాకుళం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు. ఈ నెల 18న ఎర్నాకుళం-హౌరాల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు. సంత్రాగచ్చి-తాంబరం మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 18న రద్దు చేశారు. తాంబరం-సంత్రాగచ్చి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 13,20 తేదీలలో రద్దు చేశారు. హౌరా-మైసూర్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 15న రద్దు చేశారు. మైసూర్‌-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 17న రద్దు చేశారు.


ఈ నెల 15న సంత్రాగచ్చి-చెన్నై మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేశారు. ఈ నెల 17న చెన్నై-సంత్రాగచ్చి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు. షాలీమార్‌-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 13న రద్దు చేశారు. సికింద్రాబాద్‌-షాలీమార్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 15న రద్దు చేశారు. టాటా-యశ్వంత్‌పూర్‌ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 14న రద్దు చేశారు. యశ్వంత్‌పూర్‌-టాటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 17న రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులకు గమనించాలని సూచించారు రైల్వేశాఖ అధికారులు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com