2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారతీయుడు అడుగు పెడతాడని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ మంగళవారం తెలిపారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు.
వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు అని వివరించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని తెలిపారు. దీని కింద ఇద్దరు లేదా ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపుతామన్నారు.