వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ... తన సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలు చూశారు. కన్నీళ్లు తుడిచారు. లక్షలాది మంది బతుకు కష్టాలు తెలుసుకున్నారు. తమకోసం నడిచొచ్చిన నాయకుడిని జగన్మోహన్రెడ్డిలో చూసుకున్నారు ప్రజలు. ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజాసంక్షేమం కోసం పనిచేయడం మొదలుపెట్టారు సీఎం జగన్మోహన్రెడ్డి.ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 94వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి కుటుంబానికి సంక్షేమపథకాలు ఇంటిదగ్గరకే అందేలా చేశారు జగనన్న. మన ఒక్క నియోజకవర్గానికే సంక్షేమ,అభివృద్ధి పథకాలకు వేల కోట్లు అందించారు సీఎం జగనన్న అని అన్నారు.