వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో చదువుల విప్లవం, విద్యారంగంలో దేశంలోనే ఏపి కి 3వ స్థానం వచ్చిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఉత్తరాంధ్రలో 3వ విడత సామాజిక సాధికార బస్సు యాత్ర చోడవరం నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య అపూర్వంగా సాగింది. వేలాది బైక్ లు, వందలాది కార్లతో ర్యాలీ నిర్వహించి వైయస్సార్ సీపీ ప్రజాప్రతినిధులకు అఖండ స్వాగతం లభించింది. చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంటలో జై జగన్ అంటూ హర్షధ్వానాలతో ముందుకు సాగింది. అనంతరం నియోజకవర్గ పరిదిలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. వడ్డాది జంక్షన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎంపీలు నందిగం సురేశ్, భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ , ఉమాశంకర్ గణేశ్, అదీప్ రాజుతో పాటుగా ఎమ్మెల్సీ వరుదు కల్యాణీ హాజరయ్యారు.