వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ...జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సామాజిక సాధికారత సాధించి, మన జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో మహానుభావులెందరో సామాజిక సాధికారత కావాలని ఉద్యమాలు చేశారు. అవేవీ ఫలించలేదు.కానీ ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సామాజిక సాధికారత వచ్చింది. సామాజిక న్యాయం వచ్చింది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు గుండెమీద చేయివేసుకుని బతికే రోజులు వచ్చాయి.చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బీసీలు జడ్జిలుగా పనికిరారని, మరొకరిని మీ తోకలు కట్ చేస్తానని, ఇలా వెనుకపడ్డ ప్రతి వర్గాన్ని కించపరిచిన చంద్ర బాబు దురహంకారి.31లక్షల ఇళ్లపట్టాలిస్తే, అగ్రతాంబూలం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకే. ఇక వారి పిల్లల చదువులు వారికి భారం కాకుండా చేశారు ముఖ్యమంత్రి జగన్ . ఇక పేదల ఆరోగ్యవిషయంలోనూ అద్భుత సాయం అందించేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి జగనన్న. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు చెందిన నలుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేసి తన పక్కన కూర్చోపెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల వేళ..ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోల్లో జగనన్న ఇక్కడ అందిస్తున్న సంక్షేమపథకాలను హామీలుగా ప్రకటిస్తున్నారు. జగనన్న ఇక్కడ చేస్తోంది సంక్షేమపాలన. –జగనన్న మనకు అవసరం. మన పిల్లల భవిష్యత్తుకు అవసరం. మన నమ్మకం జగనన్నే... ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని తీరాలి. అది మన బాధ్యత. మన కర్తవ్యం అని తెలియజేసారు.