శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్ర ముగిసింది . బస్సుయాత్రలో వచ్చిన ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించి, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం పాతపట్నం జంక్షన్ లో జరిగిన బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, గొర్లె కిరణ్, కళావతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ కిల్లి కృపారాణితో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు.