ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ప్రధాని మోదీ వచ్చి ఓదార్చారని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అన్నాడు. ఫైనల్లో ఓడిపోవడంతో ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లో మౌనంగా ఉన్నారు. అన్నం కూడా ఎవరూ తినలేదు. అయితే ఒక్కసారిగా ప్రధాని మోదీ వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. మా అందరితో మాట్లాడారు. ఆయన వెళ్లిన తర్వాత అందరం మాట్లాడుకున్నాం. ప్రధాని మాటలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి' అని షమీ అన్నారు.