వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ.. సమసమాజ స్థాపన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని, రాజ్యాంగ బద్దమైన పాలనను అందిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని వివరించారు. అనేక దుష్టశక్తులు మాయ మాటలతో ప్రజల ముందుకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారని, ప్రజలంతా గుర్తించి ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.