కేంద్రం ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో 4.10 లక్షల టన్నుల యురేనియం నిల్వలను సెప్టెంబర్ నాటికి కనుగొన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో వెల్లడించారు.
ఏపీలోని వైఎస్సార్, అన్నమయ్య, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో యురేనియం కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని చిత్రియాల్, ఏపీలోని కనంపల్లె వద్ద కొత్త గనులు, ప్లాంట్ల ఏర్పాటుకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోందన్నారు.