విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలో స్వీట్స్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేశారు. పాలకొండ రోడ్డులో ఉన్న ఒక స్వీట్ షాపులో పులిసి పోయిన రసగుల్లా, పురుగులతో ఉన్న కేక్ విక్రయాలు చేపట్టారు. ఈ విషయంపై కొనుగోలుదారులు నిర్వాహకులకు ప్రశ్నించారు. ఈ విషయం తెలియడంతో పురపాలక సంఘ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ స్వీట్ షాపులను తనిఖీ చేశారు. నిల్వ ఉంచిన, పురు గులు పట్టిన స్వీట్స్‌ను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేక్‌లో పురుగు పడిన విషయంపై వచ్చిన ఫిర్యాదు మేరకు షాపులో తనిఖీలు చేశామన్నారు. అందులో చని పోయిన చీమ ఉన్నట్టు గుర్తించామన్నారు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్. షాపుల్లో విక్రయించే వారి చేతులకు గ్లౌజులు వేసుకోవాలని సూచించామన్నారు. మరోసారి ఇటువంటి పరిస్థితి తలెత్తితే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కేసులు నమోదు చేస్తామన్నారు. చాలా రోజులుగా వ్యాపారులు ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అధికారులు ఇలాంటి షాపులపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. పురుగుల కేక్‌లు, పులిసిన రసగుల్లాలు తింటే ఆస్పత్రిపాలు కావడం ఖాయం అంటున్నారు.