రాష్ట్రంలో వర్షాభావం, తుపాను అనంతర పరిస్థితులపై పరిశీలన చేసిన కేంద్ర బృందంతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ విక్రాంత్ సింగ్, డీఏఎఫ్‌డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.