విజయవాడ, కొత్తపేటలోని మరు పిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని శుక్రవారం అర్ధరాత్రి కూల్చివేసేందుకు అధికారులు సన్నద్ధమవు తుండగా పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వ ర్యంలో అన్ని పార్టీ నేతలు అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత వాయిదా వేయాలని దేవదాయ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి ప్రస్తుతానికి వాయిదా వేసేందుకు అంగీకరించారు. ఏపీ ఇన్‌ఛార్జి వైనప్పన్, పీసీసీ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు, లీగల్ సెల్ అధ్యక్షుడు వి.గుర్నాధం, సీటీ అధ్యక్షుడు నరహ రశెట్టి నరసింహారావు, టీడీపీ నాయకుడు ఎం.ఎస్. బేగ్, జనసేన నేత పోతిన మహేష్, వైసీపీ కార్పొ రేటర్ ఎలకల చలపతిరావు పాల్గొన్నారు. ఏ క్షణ మైనా అధికారులు మనసుమార్చుకొని కూలగొడతారే మోనని నాయకులు రాత్రంతా అక్కడే కూర్చున్నారు.
![]() |
![]() |