నాలుగున్నరేళ్లు ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి, ఎన్నికల సమీపిస్తుండగా, ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఓ ప్రకటన చేస్తూ... ‘నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనప్పుడు ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచితే ఏంటీ? రూ.కోటికి పెంచితే ఏంటీ?’ అని డోలా ప్రశ్నించారు.