విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్-3ను ఈ నెల 30వ తేదీన ప్రారంభించడానికి వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించామని యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముడి పదార్థాల కొనుగోళ్లకు పారదర్శకమైన విధానం, నాణ్యత నియంత్రణ వ్యవస్థ ప్లాంటు కలిగి ఉన్నట్టు వివరించింది. లాభాలు సాధించాలనే లక్ష్యంతో వ్యవస్థాపక సామర్థ్యంతో ఉత్పత్తి చేయడానికి యత్నిస్తున్నట్టు పేర్కొంది. కొన్ని కార్మిక సంఘాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని విశ్వసించవద్దని కోరింది.