యానాంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.40 కోట్లతో నిర్మించిన జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (జిప్మెర్) మల్టీ స్పెషాలిటీ కన్సెల్టింగ్ యూనిట్ ద్వారా సోమవారం నుంచి ఓపీ (అవుట్ పేషెంట్)సేవలు ప్రారంభమయ్యాయి. మెడిసిన్, సర్జరీఆర్థోపెడిక్, ప్రసూతి గైనకాలజీ సేవలు అందు బాటులో ఉన్నాయని యానాం జిప్మెర్ మెడికల్ ఆఫీసర్ ఆనంద్‌రాజ్ తెలి పారు. అన్ని పనిదినాల్లో ఉదయం8నుంచి 10.30గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆపరేషన్ థియేటర్లు, ఇతర సౌకర్యాలు పూర్తయిన తర్వాత ఇన్‌పేషెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.