పొదలకూరు మండలంలో రుస్తుం క్వారీ నుంచి రూ.కోట్ల తెల్లరాయిని తరలిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ‘సత్యాగ్రదీక్ష’ పేరుతో 16 నుంచి ఆందోళనకు దిగారు. మూడు రోజులుగా క్వారీ వద్దే దీక్షకు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి మూడు రోజులుగా రేయింబవళ్లు క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే, కోట్లాది రూపాయల ప్రజా సంపదను అక్రమంగా కొల్లగొట్టుకొని పోతున్నారని ఆరోపిస్తుంటే.. ఈ విషయం మీడియాలో ప్రధా న వార్తాంశాలుగా చక్కర్లు కొడుతున్నా.. మూడు రోజులుగా ఒక్క అధికారి కూడా ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అధికారుల ప్రతినిధులుగా ప్రభుత్వ శాఖల గుమాస్తాలు కూడా అటు వైపు తిరిగి చూడలేదు అని ఆరోపించారు.