విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20వ తేదీన జరగనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ పాల్గొని సంఘీభావం తెలపనున్నట్టు పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్త రమేష్‌బాబు తెలిపారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరుపార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, పార్టీ నాయకులు పీవీఏస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.