నెల్లూరు జిల్లాలో దేశంలోనే అతపెద్ద కుంభకోణం జరుగుతోందని రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారని, సీఎం జగన్ శ్రీమతి భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, హిజ్రాలు, వైసీపీ గూండాలను పంపి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారని చెప్పారు. ఇంత దిగజారడం ఎన్నడూ చూడలేదన్నారు. ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదని, ఉద్యమం ఇంతటితో ఆపేదిలేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున జెలిటిన్ స్డిక్స్, డిటోనేటర్ల డంప్‌ను చూపినా అధికారులు స్పందించలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.