ప్రజలను కాపాడే పోలీసులకే మస్కా కొట్టి రూ.12 కోట్లతో మహిళ ఉడాయించింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని శ్రీరామ్నగర్కాలనీకి చెంది న ఇల్లూరి శ్రీదేవి 2016 నుంచి గుడిమెట్ల రాజేష్, జనార్దన్రావులతో కలిసి చీటీ పాటలు నిర్వహిస్తోంది.
స్థానిక ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో పనిచేసే పోలీసులు, ఇతరుల నుంచి రూ.5 లక్షలు నుంచి రూ.20 లక్షల వరకు నగదు వసూలు చేసింది. బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమన్నారు.