భోగాపురం మండలం పోలిపల్లిలో జరుగు యువగళం ముగింపు మహాసభకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు ఆరోపించారు.
సోమవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సభ నిర్వహణకు పోలీసులు సహకరించడం లేదని ఇప్పటికే విజయనగరం ఎస్పీతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం యువగళం ముగింపు సభ ప్రారంభమవుతుందన్నారు.