శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరు కిటకిటలాడుతోంది. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులు భారీ క్యూ కట్టారు. దీంతో అధికారులు అయ్యప్ప భక్తులను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకే ఇలా చేస్తున్నామని చెప్పారు. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు ఇప్పటికే పలుమార్లు లాఠీచార్జి చేశారు. దీంతో కేలరా ప్రభుత్వం, పోలీసులపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని కిక్కిరిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. శబరిమల మార్గ మధ్యలోనే భక్తుల్ని గంటల తరబడి పోలీసులు నిలిపివేస్తున్నారు.