మనస్థాపంతో చోడవరంకు చెందిన వివాహిత మామిడిపక మహాలక్ష్మి సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్టు సిఐ బి శ్రీనివాసరావు చెప్పారు. భార్య భర్తల మధ్య నెలకొన్న గొడవలే ఇందుకు కారణమని తెలిపారు.
భర్త శ్రీనివాస్ మద్యానికి బానిసై గొడవలు పడుతూ ఇంటి గురించి పట్టించుకోకపోవడంతో ఆమె మనస్థాపానికి గురైనట్టు తెలిపారు. మృతురాలు తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.