‘సింగడు అద్దంకి వెళ్లాడు వచ్చాడు..’ అన్న చందంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా సింగడు అలియాస్ నారా లోకేశ్ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టి ముగించాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. అసలెందుకు యాత్ర చేశాడంటే.. ఏమో చేశాను.. ముగించాననే సమాధానమే చెబుతున్నాడన్నారు. యువగళం పేరిట లోకేష్ చేసిన యాత్రకు ఒక లక్ష్యమంటూ లేదన్నారు. లోకేష్ ఎవరి కోసం పాదయాత్ర చేశాడో అతనికే తెలియడంలేదని విమర్శించారు. రాత్రిపూట నడిచాడో.. పగటిపూట పడుకున్నాడో గానీ.. మొత్తానికి అక్కడక్కడా రుచికరమైన వంటలు తింటూ సవాలక్ష కామెడీలతో యువగళం యాత్రను మమ అనిపించేశాడని ఎద్దేవా చేశారు.