ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలు వారీగా ఆడుదాం ఆంధ్ర సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం మూడు గంటలకు మరి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సీఎం జగన్ మాట్లాడనున్నారు. ఇన్చార్జుల మార్పులు, చేర్పులు సీటు కొనసాగింపు లేదా మార్పుపై సీఎం, పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.