ఈ నెల 23 న ముక్కోటి సందర్భంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వదర్శనం, రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచారు. ముక్కోటి ముందు రోజు 22న స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరగనుంది. ముక్కోటి రోజు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభించనుంది.