పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన నిరసన ఘటనపై రాజ్య సభ చైర్మెన్ జగదీప్ ధన్ఖడ్ కు ప్రధాని మోది ఫోన్ చేశారు. ఈ మేరకు ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని ఉప రాష్ట్రపతి ట్విటర్ ద్వారా తెలిపారు.
‘పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాలు చేపట్టిన నిరసన తీరుపై ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. ఎంపీలు వ్యవహరించిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటన నా కర్తవ్య నిర్వహణను అడ్డుకోలేదని మోదీకి వెల్లడించాను’ అని ట్వీట్లో తెలిపారు.