చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాగారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు.. మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
మావోయిస్టుల క్యాంప్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెంది ఉంటారని పోలీసులు తెలిపారు. మావోయిస్టుల క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa