మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్‌గా ఎదగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని సీఎం తెలిపారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో చదువుతున్నారని చెప్పారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే ఈ పథకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రూ. 8లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పాస్ అయితే రూ.లక్షా 50 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.