ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 08:19 PM

యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇది నవశకం.. యుద్ధం మొదలైందని.. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు యుద్ధం ఆగదన్నారు. విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగిన యువగళం నవశకం సభలో లోకేష్ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యల్ని తెలుసుకునే అద్భుత అవకాశం దక్కిందన్నారు. అడుగడునా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకుసాగామన్నారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని.. విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్‌ .. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ దెబ్బతీశారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు.


యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టానని.. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. యువగళాన్ని ఆపేందుకు జగన్ జీవో 1 తీసుకొచ్చారని.. మైక్ వెహికల్ లాక్కున్నారని.. అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఇది.. ఆపేవారు ఇంకా పుట్టలేదన్నారు. పోలీసుల్ని పంపారు యువగళం ఆగలేదని.. వైసీపీ గూండాలను పంపితే పసుపు సైన్యాన్ని చూసి పారిపోయారన్నారు. ఒక పక్క యువగళం.. మరో పక్క చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ.. పవన్ వారాహి యాత్ర తో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైందన్నారు. 'చంద్రబాబును చూస్తే జగన్ భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎం గా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది. 53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ ఏపీకి వస్తుంటే అడ్డుకుంటారు.


జగన్ హయాంలో ఏపీ అప్పు 12 లక్షల కోట్లకు చేరబోతోంది.. ఏడాదికి మనం కట్టాల్సిన వడ్డీ లక్ష కోట్లు. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే భారం మొయ్యాల్సింది ప్రజలే. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి.. ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవన్ రాష్ట్రానికి కావాలి' అన్నారు లోకేష్.


లోకేష్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..


 ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.


 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలెక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి... పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది.


 ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది... జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి.


 ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి...జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది.


 యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.


 నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం.


 టిడిపి - జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.


 జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.


 జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2.


 రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది.


 మిచౌంగ్ తుఫాను తీవ్రంగా ఉంటుంద‌ని ప‌ది రోజుల నుంచే కేంద్ర విప‌త్తు సంస్థ‌లు హెచ్చ‌రించాయి.


 రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల్లో రూ.10వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతింటే కనీసం ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాసే టైం కూడా జగన్ కి లేదు.


 రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.


* చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మొదట నాకు కాల్ చేసి అండగా నిలిచింది పవనన్న. గుండెల్లో ఎంత బాధ ఉన్నా నువ్వు ప్రజల కోసం పోరాడు అని ప్రజల్లోకి పంపింది మా అమ్మ భువనమ్మ.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com