ఆరేబియా సముద్రంలో మాల్టాకు చెందిన ఎంవీ రుయెనీ కార్గో నౌకకు సముద్రపు దొంగలు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, హైజాక్‌కు గురైన మాల్టా కార్గో నౌక నుంచి గాయపడిన నావికుడిని తరలించడానికి భారత నావికాదళం సహాయం చేసింది. చికిత్స కోసం ఒమన్‌కు తరలించిన నావికుడిని హైజాకర్లు విడుదల చేసినట్టు నేవీ తెలిపింది. గాయపడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఐఎన్ కార్గో నౌకలో గాయపడిన సిబ్బంది వైద్యపరంగా అత్యవసర వైద్య సహాయం అవసరం.. ఇది ఓడ పరిధికి మించింది.. అతడ్ని ఒమన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించాం’ అని నేవీ వెల్లడించింది. సోమాలియా తీరం నుంచి వెళ్తున్న నౌక నుంచి శనివారం మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. సముద్రపు దొంగలు చొరబడి నౌకను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ నౌక నుంచి వచ్చిన ఎమర్జెన్సీ కాల్‌తో మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ నౌకను రంగంలోకి దిపింపినట్టు నేవీ అధికారికంగా ప్రకటిచింది. భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక శనివారం నుంచి ఎంవీ రుయెన్‌ను ట్రాక్ చేస్తోంది. సహాయం కోసం వచ్చిన పిలుపుకు భారత నావికాదళం వేగంగా స్పందించింది. నౌకకు సాయంగా గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో యాంటీ పైరసీ పెట్రోలింగ్ యుద్ధనౌకను మోహరించారు. హైజాక్ చేసిన నౌకను నేవీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కదలికను పర్యవేక్షిస్తున్నామని నేవీ తెలిపింది. ఓడ ఇప్పుడు సోమాలియా తీరం వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. కాగా, 2017 తర్వాత సోమాలియా పైరెట్లు నౌకలపై జరిపిన అతిపెద్ద దాడి ఇదే. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు యూకే నేవీ హెచ్చరికలు జారీచేసింది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది.