పార్లమెంట్ పై దుండగులు జరిపిన దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలతో పార్లమెంట్ భవనానికి పూర్తిస్థాయిలో భద్రతను ఏర్పాటుచేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
హ్యాండ్ డిటెక్టర్స్, ఎక్స్-రే మెషీన్లతో పరీక్షలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు సర్వే చేపట్టాల్సిందిగా కేంద్ర హోం శాఖ నుంచి బుధవారం ఆదేశాలు వెలువడ్డాయని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa