పార్లమెంట్ నుంచి ఎంపీల సస్పెన్షన్‌పై నేడు ఇండియా కూటమి ఢిల్లీ జంతర్‌మంతర్‌లో తీవ్ర నిరసన తెలుపనుంది. మొత్తం 146 ఎంపీలు శీతాకాల సమావేశాల నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మణిక్యం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరణించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాగా, దీన్ని వ్యతిరేకిస్తూ ఖర్గే, రాహుల్ నిరసనలో పాల్గొననున్నారు.